Kalvakuntla Kavita: నేను తెలంగాణ ప్రజల బాణాన్ని
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:27 AM
నేను తెలంగాణ ప్రజల బాణాన్ని.. నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదని, 2029 ఎన్నికల్లో బరిలో ఉంటాం. బీఆర్‌ఎ్‌సలో నేనెప్పుడూ కీలకంగా లేను...
బీఆర్‌ఎ్‌సలో ఎప్పుడూ కీలకంగా లేను
టీచర్‌ను కూడా బదిలీ చేయించుకోలేకపోయా: కవిత
యాదాద్రి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను తెలంగాణ ప్రజల బాణాన్ని.. నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదని, 2029 ఎన్నికల్లో బరిలో ఉంటాం. బీఆర్‌ఎ్‌సలో నేనెప్పుడూ కీలకంగా లేను. టీచర్‌ను కూడా బదిలీ చేయించుకోలేకపోయాను. ఐదేళ్లు కూడా నిజామాబాద్‌కే పరిమితమయ్యా’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆమె రెండో రోజూ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష, అధికారపక్ష పార్టీలు తనను కేసీఆర్, ఇతర పార్టీలెవరో వదిలిన బాణం అంటూ వ్యాఖ్యానిస్తున్నారని, అవన్నీ నిజం కాదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే రాయగిరి రైతులకు బేడీలు వేశారని తెలిసింది.. అప్పుడు తాను ఆ పార్టీలో ఉన్నందున ఆ పాపంలో తనకు భాగం ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు. ఏది ఏమై నా ప్రజలకు అన్యాయం జరిగినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. రేవంత్‌రెడ్డి అంటేనే ఆర్‌ఎస్‌ఎస్ సీఎం అని, ఆయన బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన నోటీసులు ఊహాజనితమేనని, ఆ అంశంపై తాను మాట్లాడలేనని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.