Share News

Minister Sridhar Babu: ఇక్కడ పెట్టుబడులు పెట్టండి

ABN , Publish Date - Nov 08 , 2025 | 02:51 AM

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఈవోడీబీలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు...

Minister Sridhar Babu: ఇక్కడ పెట్టుబడులు పెట్టండి

  • ‘అమెరికా - యూటా’ రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌ బాబు పిలుపు

హైదరాబాద్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈవోడీబీ)లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా - యూటా పారిశ్రామికవేత్తలను ర్కా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ - యూటా ఎండీ, సీవోవో డేవిడ్‌ కార్లెబాగ్‌ నేతృత్వంలోని ‘యూటా పారిశ్రామికవేత్తల బృందం’ శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిసింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, అడ్వాన్స్డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, లైఫ్‌సైన్సెస్‌, ఏఐ ఆధారిత హెల్త్‌ కేర్‌, క్లీన్‌ ఎనర్జీ, ఎడ్యుకేషన్‌, స్కిల్స్‌ తదితర రంగాల్లో ‘యూటా-తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించా. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక, గ్లోబల్‌ ఎకానమీకి సపోర్ట్‌ ఇచ్చేలా, లాంగ్‌-టర్మ్‌ వాల్యూ క్రియేషన్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహాకాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు ‘యూటా’ సిద్థంగా ఉందని డేవిడ్‌ కార్లెబాగ్‌ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలంగాణతో కలిసి చురుగ్గా పని చేస్తామన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 02:51 AM