Industries Minister Duddilla Sridhar Babu: ఐటీ, రక్షణ, ఫార్మా రంగాల్లో కలిసి పని చేద్దాం
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:45 AM
ఐటీ, రక్షణ, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జర్మనీ పార్లమెంట్ బృందం....
జర్మనీ పార్లమెంటరీ బృందానికి భట్టి, శ్రీధర్‌బాబు పిలుపు
ఐటీ, రక్షణ, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జర్మనీ పార్లమెంట్ బృందం ప్రజాభవన్‌లో భట్టి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని జర్మనీ బృందానికి భరోసా ఇచ్చారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపడానికి, మెటలర్జీ, కార్ల తయారీ రంగంలో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్యూచర్ సిటీలోని స్కిల్ వర్సిటీలో జర్మన్ లాంగ్వేజ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు జర్మనీ పార్లమెంట్ బృందంతో చెప్పారు. సైబర్ ఫిషింగ్‌ను అరికట్టడానికి బెస్ట్ ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ బాగుందని జర్మనీ పార్లమెంటు బృందం అభినందించింది.