Share News

Electric Vehicles: 3,752 ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:47 AM

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం మరింత పెరగాలంటే దానికి తగ్గట్లుగా చార్జింగ్‌ సౌకర్యాలు పెంచాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి...

Electric Vehicles: 3,752 ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు

  • దక్షిణ డిస్కమ్‌ పరిధిలో ఏర్పాటు!

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా పలు చోట్ల అనువైన ప్రాంతాల్ని గుర్తించిన అధికార్లు

  • నాలుగు కేటగిరీలుగా విభజన

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం మరింత పెరగాలంటే దానికి తగ్గట్లుగా చార్జింగ్‌ సౌకర్యాలు పెంచాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ హైవేలతో పాటు రాష్ట్ర హైవేలపై చార్జింగ్‌ కేంద్రాలకు అనువైన ప్రాంతాలు అధికారులు గుర్తిస్తున్నారు. దక్షిణ డిస్కమ్‌ (టీజీఎస్పీడీసీఎల్‌) పరిధిలో గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు వివిధ చోట్ల ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు పెట్టుకోవడానికి 3,752 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని తేల్చారు. నాలు గు కేటగిరీల్లో ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు పెట్టడానికి వీలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఏ కేటగిరీలో, నగరాలతో పాటు హైవేలను బీ, పట్టణాలు, వీధులు, షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్‌ కాంప్లెక్స్‌లను సీ, బ్యాట రీ స్వాపింగ్‌ కేంద్రాలు/బ్యాటరీ చార్జింగ్‌ కేంద్రాలను ఎక్కడైనా పెట్టుకుంటే డీ కేటగిరీ కింద పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో ఏ కేటగిరీ కింద 1,991, బీలో 294, సీలో 1,467 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని గుర్తించారు.

Updated Date - Oct 30 , 2025 | 04:47 AM