Telangana Human Rights Commission: గిరిజన హాస్టల్ బాధిత కుటుంబానికి సహాయం చేయండి
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:03 AM
ఖమ్మంలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకున్న 10 ఏళ్ల విద్యార్థి దేవత్ జోసెఫ్ మరణం కేసులో బాధిత కుటుంబానికి ఒక రెగ్యులర్ ఉద్యోగం....
రెగ్యులర్ ఉద్యోగం, రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి టీజీహెచ్‌ఆర్‌సీ సిఫార్సు
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఖమ్మంలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకున్న 10 ఏళ్ల విద్యార్థి దేవత్ జోసెఫ్ మరణం కేసులో బాధిత కుటుంబానికి ఒక రెగ్యులర్ ఉద్యోగం, రూ.5 లక్షల సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. గిరిజన సంక్షేమ అధికారుల నిర్లక్ష్యం వల్లే దేవత్ జోసెఫ్ మరణించాడని టీజీహెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని బృందం నిర్ధారించింది. ఆ బాలుడి తల్లికి చెవిటి, మూగతనం ఉందని కమిషన్ గుర్తించింది. తన కుమార్తెతో పాటు వృద్ధ అత్తనూ పోషించాల్సిన బాధ్యత ఆమెపై ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమెకు లాస్ట్ గ్రేడ్ కేటగిరీలో రెగ్యులర్ ఉద్యోగంతో పాటు, రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును ఆరు నెలల్లోగా అమలు చేసి, ఆ నివేదికను కమిషన్‌కు సమర్పించాలని తెలిపింది.