High Court: గ్రూప్-1 అప్పీళ్లపై నేడు విచారణ
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:56 AM
గ్రూప్-1 ఫలితాలను కొట్టివేయడంతోపాటు సమాధాన పత్రాలను పునః మూల్యాకంనం చేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన అప్పీళ్లు...
గ్రూప్-1 ఫలితాలను కొట్టివేయడంతోపాటు సమాధాన పత్రాలను పునః మూల్యాకంనం చేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన అప్పీళ్లు బుధవారం హైకోర్టులో విచారణకు రానున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సింగిల్ జడ్జి తీర్పుపై మొత్తం 15 అప్పీళ్లు దాఖలు కాగా ఇందులో టీజీపీఎస్సీ 12 అప్పీళ్లు, పలువురు ఎంపికైన అభ్యర్థులు మూడు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిలో ఒక పిటిషన్ మంగళవారం చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట విచారణ రాగా బుధవారం మిగతా పిటిషన్లన్నీ విచారణకు వస్తున్న నేపథ్యంలో అన్నింటిని కలిపి వినాలని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.