Share News

Telangana High Court: పోలీసు భర్తీపై పిటిషన్‌ పెండింగ్‌లో ఉందా?

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:12 AM

పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీపై ఏదైనా పిటిషన్‌ పెండింగ్‌లో ఉందా అని హైకోర్టు ఆరా తీసింది. భారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే విధంగా ఆదేశాలు జారీచేయాలని...

Telangana High Court: పోలీసు  భర్తీపై పిటిషన్‌ పెండింగ్‌లో ఉందా?

  • వెతకాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు

పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీపై ఏదైనా పిటిషన్‌ పెండింగ్‌లో ఉందా అని హైకోర్టు ఆరా తీసింది. భారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే విధంగా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) విచారణ సందర్భంగా పాత పిటిషన్‌ను ప్రస్తావించింది. పోలీసుశాఖలో మొత్తం మంజూరైన పోస్టులు 91,295 ఉండగా 14,874 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. మంజూరైన పోస్టుల కంటే 16 శాతం తక్కువగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పోలీసు ఉద్యోగాల ఖాళీపై సుమోటోగా విచారణ జరపాలని గతంలో హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించిందని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో గతంలో హైకోర్టు ఈ విషయమై ఏమైనా ఆదేశాలు జారీచేసిందా? అని పిటిషనర్‌, ప్రభుత్వ న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదుల వద్ద సమాచారం లేకపోవడంతో ఏమైనా పెండింగ్‌లో ఉంటే వెతకాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది.

Updated Date - Sep 18 , 2025 | 05:12 AM