Share News

High Court Judge Mourns Loss: సహాయకుడి మృతితో తల్లడిల్లిన న్యాయమూర్తి

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:17 AM

తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి వద్ద సహాయకుడిగా పని చేస్తున్న కొత్తపల్లి ఉదయ్‌ కుమార్‌ ..

High Court Judge Mourns Loss: సహాయకుడి మృతితో తల్లడిల్లిన న్యాయమూర్తి

  • కన్నీరు పెట్టిన హైకోర్టు జడ్జి జస్టిస్‌ శ్రీదేవి

మామడ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి వద్ద సహాయకుడిగా పని చేస్తున్న కొత్తపల్లి ఉదయ్‌ కుమార్‌ (23)మంగళవారం నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఆయన సతీమణి హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవి వద్ద కొన్నేళ్లుగా ఉదయ్‌ పని చేస్తున్నాడు. సమాచారం తెలిసిన వెంటనే భార్యాభర్తలు ఉదయ్‌ స్వగ్రామం మామడ మండలం సల్దుర్తికి చేరుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురైన జస్టిస్‌ శ్రీదేవి, ఆమె భర్త శ్రీహరిరావు.. ఉదయ్‌ కుటుంబసభ్యుల రోదనలు చూసి దుఃఖం ఆపుకోలేక బోరున విలపించారు. తమ కుటుంబంతో ఉదయ్‌కు విడదీయలేని అనుబంధం ఉందని, పిన్నవయస్సులోనే దూరంకావడం తీవ్రంగా కలచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 04:17 AM