Share News

Solar Power: రాష్ట్రంలో 1.40 లక్షల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పాదనకు అవకాశం

ABN , Publish Date - Oct 02 , 2025 | 04:31 AM

రాష్ట్రంలో 1.40 లక్షల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనకు అనుకూలత ఉందని కేంద్రం వెల్లడించింది..

Solar Power: రాష్ట్రంలో 1.40 లక్షల మెగావాట్ల  సోలార్‌ విద్యుదుత్పాదనకు అవకాశం

  • కేంద్ర ప్రభుత్వం నివేదిక

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1.40 లక్షల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనకు అనుకూలత ఉందని కేంద్రం వెల్లడించింది. సోలార్‌ పీవీ పోటెన్షియల్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ(ఎన్‌ఐఎ్‌సఈ)లతో కలిసి పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ(ఎంఎన్‌ఆర్‌ఈ) బుధవారం ఈ నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోలార్‌ ప్లాంట్లు పెట్టడానికి విస్తారమైన అవకాశాలున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో 8.88 శాతం బంజరు/వ్యవసాయ యోగ్యత లేని భూములు ఉన్నాయని, ఈ నిరుపయోగ ప్రాంతాలు సోలార్‌ ప్లాంట్లు పెట్టుకోవడానికి అనువైనవని ఈ నివేదిక పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 16 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు పెట్టడానికి అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలుండగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 4.95 మెగావాట్ల ప్లాంటు పెట్టడానికి అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

Updated Date - Oct 02 , 2025 | 04:31 AM