Telangana Public Service Commission: ఒకట్రెండు రోజుల్లో గ్రూప్ 2 తుది జాబితా!
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:39 AM
రాష్ట్రంలో గ్రూప్ 2 సర్వీసు పోస్టుల తుది జాబితా విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని..
ఏర్పాట్లు పూర్తిచేసిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్-2 సర్వీసు పోస్టుల తుది జాబితా విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని కసరత్తు చేస్తోంది. గ్రూప్-2లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, మెరిట్, తదితర విషయాలు పరిగణన లోకి తీసుకుని ఒకట్రెండు రోజుల్లో తుది జాబితా ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐసీడీఎస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల పోస్టుల తుది జాబితాను కమిషన్ శనివారం విడుదల చేసింది. మొత్తం 181 పోస్టుల్లో 176 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల తుది జాబితా వెబ్‌సైట్లో ఉంచామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.