Telangana High Court: గ్రూప్-1 తుది జాబితా విడుదల
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:17 AM
గ్రూప్-1 పరీక్షల ఫలితాలకు సంబంధించి టీజీపీఎస్సీ తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో...
45 మంది డిప్యూటీ కలెక్టర్లు, 115 డీఎస్పీలు సహా.. 562 మందితో జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ
హైకోర్టు తీర్పుతో అర్ధరాత్రి వెల్లడించిన కమిషన్
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్షల ఫలితాలకు సంబంధించి టీజీపీఎస్సీ తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి తుది జాబితాను సిద్ధం చేసింది. మొత్తం 563 పోస్టుల కోసం ఇప్పటికే 600 మందిని ఎంపికచేసిన కమిషన్.. వారి ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ప్రక్రియను పూర్తిచేసింది. తుది జాబితా ప్రకటించబోయే సమయంలో కోర్టు స్టే ఇవ్వడంతో ప్రక్రియ నిలిచిపోయింది. నియామక ప్రక్రియ ప్రారంభించవచ్చని బుధవారం కోర్టు తీర్పు ఇవ్వడంతో.. వెంటనే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న వారిలో 563 మందికి వారి ర్యాంకుల ఆధారంగా తుది జాబితా సిద్ధం చేసి అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. 562 మందిని ఎంపిక చేసి.. ఒక పోస్టును పెండింగ్‌లో ఉంచారు. తుది జాబితాలో 45 డిప్యూటీ కలెక్టర్, 115 డీఎస్పీ పోస్టులతోపాటు వివిధ శాఖల్లోని మొత్తం 563 పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ బుధవారం అర్ధరాత్రి పూర్తయింది. దీనికి సంబంధించి అభ్యర్థులకు టీజీపీఎస్సీ సమాచారం అందించింది. ర్యాంకులవారీగా పోస్టులు కేటాయించారు. తుది జాబితా విడుదల కావడంతో.. ఎంపికైనవారు తమకు కేటాయించిన శాఖల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.