Health Department Posts Soon: వైద్య ఆరోగ్యశాఖలో త్వరలో 7,267పోస్టుల భర్తీ
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:38 AM
వైద్య ఆరోగ్యశాఖలో 7,267 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 1,623 స్పెషలిస్టు డాక్టర్లు....
2,322 స్టాఫ్ నర్సుల నియామకాలు
జాబితాలో స్పెషలిస్టు డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మసిస్టు పోస్టులు.. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో 7,267 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 1,623 స్పెషలిస్టు డాక్టర్లు, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 48 డెంటల్ డాక్టర్లు, 2,322 స్టాఫ్‌నర్స్‌లు, 732 ఫార్మసిస్టులు, 1,931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మహిళ), నాలుగు స్పీచ్ పాథాలజిస్టు పోస్టులున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైద్యశాఖలో మొత్తం 9,203 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండేళ్లలో వైద్యరంగంలో సాధించిన ప్రగతిపై బుధవారం నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్ల సంఖ్యను క్రమంగా పెంచుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతో అదనంగా 450 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలతో రాష్ట్రంలో వాటి సంఖ్య 37కు పెరిగింది. ఈ రెండేళ్లలో 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. క్యాన్సర్ రోగులకు జిల్లాల్లోనే కీమో థెరపి చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్ తగ్గింది
కాంగ్రెస్ వచ్చాక కొత్తగా 213 అంబులెన్స్‌లను ప్రారంభించామని, వీటితో ఎమర్జన్సీ రెస్పాన్స్ టైమ్ గిరిజన ప్రాంతాల్లో 20 నిమిషాల నుంచి 14 నిమిషాలకు తగ్గిందని, గ్రామీణ ప్రాంతాల్లో 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గిందని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. త్వరలోనే మరో 77 అంబులెన్స్‌లు తీసుకువచ్చి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్‌ను 10నిమిషాలకు తగ్గించనున్నట్లు వివరించింది. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంతానలేమి సమస్యలతో బాధపడే వారి కోసం హైదరాబాద్‌లోని గాంధీ, పెట్లబుర్జు హాస్పిటళ్లలో ఐవీఎఫ్ ేసవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. వరంగల్ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ట్రాన్స్‌జెండర్లకు అవసరమైన వైద్య ేసవల కోసం ప్రత్యేకంగా మైత్రి క్లినిక్స్‌ను ప్రారంభించింది.
వందేళ్లకు తగ్గట్లుగా ఉస్మానియా
హైదరాబాద్‌లో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్(టిమ్స్) త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అల్వాల్ టిమ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో సైన్సె్‌సగా, సనత్‌నగర్ టిమ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ సైన్సె్‌సగా, కొత్తపేట్ టిమ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్యాస్ర్టో సైన్సె్‌సగా ేసవలు అందించనున్నాయి. వందేళ్ల అవసరాలకు తగ్గట్లుగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, రూ.2వేల కోట్లతో నూతన ఆసుపత్రికి శ్రీకారం చుట్టామని ప్రభుత్వం వెల్లడించింది.