Share News

Minister Damodar Rajanarasimha: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌కు పూర్వవైభవం

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:53 AM

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను....

Minister Damodar Rajanarasimha: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌కు పూర్వవైభవం

  • వైద్యమంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పన, పరికరాల మరమ్మతు, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌, పారిశుధ్యం, డ్రైనేజీ సిస్టం, అంతర్గత రోడ్లు, రోగులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య ేసవల బలోపేతంపై మంత్రి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెంటల్‌ హెల్త్‌లో ప్రస్తుత ఓపీ, ఐపీ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో తక్షణమే పర్యటించి వచ్చే రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని టీజీఎంఎ్‌సఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రిపైనా మంత్రి చర్చించారు.

Updated Date - Sep 18 , 2025 | 05:53 AM