Boost Startups: స్టార్ట్‌పలకు సర్కారు బూస్టప్
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:22 AM
తెలంగాణలో అంకుర (స్టార్టప్) సంస్థలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రాష్ట్రాన్ని అంకురాల కేంద్రంగా..
ఏడాదికి 200 పైగా అంకుర సంస్థలకు వివిధ రంగాల్లో శిక్షణ, సలహాలు
ఆర్థిక సాయం కోసం రూ.50 కోట్ల నిధి
టీ హబ్‌లో గూగుల్‌కు 2 అంతస్తుల్లో ఆఫీస్
డిసెంబరు 9న ప్రారంభించనున్న సీఎం
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అంకుర (స్టార్టప్) సంస్థలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రాష్ట్రాన్ని అంకురాల కేంద్రంగా, మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి స్టార్ట్‌పలకు ప్రత్యేక సాయాలను అందించనుంది. వీటిలో ప్రధానంగా ఆర్థిక సాయం, మార్గదర్శనం (మెంటార్‌షిప్), సాంకేతిక శిక్షణలు ఉంటాయి. ఇందుకోసం హైదరాబాద్‌లోని టీ హబ్ భవనంలో రెండు అంతస్తులను గూగుల్‌కు కేటాయించారు. అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తోంది. అంకురాలకు ఆర్థిక సాయంతో పాటు పలు రకాల సేవలను అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలను గూగుల్ ద్వారా హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. అలాగే గూగుల్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఉన్న నెట్‌వర్క్ సంస్థలు, ఇతర భాగస్వామ్య సంస్థల ద్వారా దాదాపు రూ.50 కోట్ల నిధులను సేకరించనున్నారు. ఆ నిధుల నుంచే స్టార్ట్‌పలకు ఆర్థిక సాయం అందించనున్నారు. మరికొన్ని కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్) కింద కూడా నిధులు సేకరించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. స్టార్ట్‌పలకు ఊతమిచ్చేందుకు ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ఎట్ టీ హబ్’ పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని, టీ హబ్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని డిసెంబరు 9న సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీ హబ్‌లో పనులు పూర్తి కావచ్చాయని చెబుతున్నారు.
సిలికాన్‌వ్యాలీ, జపాన్ నుంచి నిపుణులు..
తెలంగాణలో ప్రస్తుతం సాంకేతికత, విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా రంగాల్లో స్టార్ట్‌పలు విస్తృతంగా వస్తున్నాయి. ఇవి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దశాబ్ద కాలంగా ఐటీ హబ్‌గా తెలంగాణ పేరు తెచ్చుకున్నప్పటికీ అంకురాలను అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు లేవని నిపుణులు చెబుతున్నారు. స్టార్ట్‌పలు బలోపేతమవ్వాలంటే ప్రోత్సాహకాలే కీలకమని అంటున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌తో కలిసి ప్రత్యేకంగా స్టార్ట్‌పలకు సాయం అందించాలని నిర్ణయించింది. దీని ద్వారా ప్రారంభ దశలో పెట్టుబడి (మూలధనం, వాటాలు) కోసం ఇబ్బందులు పడే అంకురాలకు ఆర్థిక సాయం అందిస్తారు. గూగుల్, దానికి అనుసంధానంగా ఉన్న కొన్ని ప్రముఖ కంపెనీలు, నెట్‌వర్క్ సంస్థల్లో పనిచేసే నిపుణులతో నేరుగా అంకురాల ఉన్నతికి శిక్షణ, సలహాలు, సూచనలు ఇస్తారు. గూగుల్ టెక్నాలజీతో కూడుకొని ఉన్న వేదికలు, టూల్స్‌ను వినియోగించుకుని స్టార్ట్‌పల వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, విస్తరించేందుకు అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా ఏడాదిలో 200కు పైగా స్టార్ట్‌పలకు శిక్షణలు, 10కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో టీ హబ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తారు. అలాగే స్టార్ట్‌పలు త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు ఏఐ/ఎంఎల్, యూఎక్స్, జీటీఎం డొమైన్లలో క్లాసుల కోసం అవసరమైన ఏర్పాట్లు గూగుల్ చేస్తుంది. సిలికాన్‌వ్యాలీ, జపాన్, ఆగ్నేసియాల నుంచి ప్రముఖ నిపుణులను హైదరాబాద్ తీసుకొచ్చి తరగతులు చెప్పించే ఏర్పాట్లూ చేస్తుంది.
అంకురాలకు సాయంపై ప్రత్యేక క్యాలెండర్
ప్రభుత్వం, గూగుల్ కలిసి స్టార్ట్‌పలకు అందించబోయే సాయం, శిక్షణల కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామింగ్ క్యాలెండర్‌ను రూపొందించారు. ఫౌండర్స్ అకాడమీ, గూగ్లర్ క్లినిక్, ఏఐ స్ట్రాటజీ వర్క్‌షాపులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాలు, సాంకేతికతలో మహిళల ప్రభావం, సామాజిక ప్రభావం, విద్యార్థుల హ్యాకథాన్‌లు.. ఇలా పలు కార్యక్రమాలు ఉంటా యి. ఏడాదికి30 కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. దీని ప్రకారం ఫౌండర్స్ అకాడమీ 6సెషన్లు, గూగ్లర్‌మాస్టర్ క్లాసులు 5, ఇన్నోవేషన్ డే, హ్యాకథాన్‌లు 10, విద్యార్థులు, మహిళలకు సంబంఽధించి 8 క్యాంప్‌సల్లో ఈవెంట్లు, పెట్టుబడిదారులతో 5రౌండ్‌టేబుల్ సమావేశాలు ఉండనున్నాయి.