Share News

Harish Rao: ట్యాపింగ్‌ కేసులో..హరీశ్‌ మెడకు ఉచ్చు!

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:01 AM

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ ట్యాప్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది!

Harish Rao: ట్యాపింగ్‌ కేసులో..హరీశ్‌ మెడకు ఉచ్చు!

  • రియల్టర్‌ చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ ట్యాప్‌

  • కేసులో సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ ట్యాప్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది! ఈ వ్యవహారంలో హరీశ్‌ను ప్రతివాదిగా చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వచ్చే నెల 5న దీనిపై విచారణ జరగనుంది. మాజీ మంత్రి హరీశ్‌ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారి రాధాకిషన్‌రావు తన ఫోన్‌ను ట్యాప్‌ చేశారంటూ చక్రధర్‌గౌడ్‌ గత ఏడాది డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు హరీశ్‌, ఆయన పీఏ వంశీకృష్ణ, మరికొందరిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై అక్రమంగా కేసు పెట్టారని, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని హరీశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం హరీశ్‌పై కేసును కొట్టివేస్తూ 2025 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. చక్రధర్‌గౌడ్‌ దాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హరీశ్‌ుపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసింది. అందులో హరీశ్‌తోపాటు చక్రధర్‌గౌడ్‌ను కూడా ప్రతివాదిగా చేర్చింది. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. 5న జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ద్విసభ్య ధర్మాసనందీనిపై విచారణ జరపనుంది.

Updated Date - Dec 31 , 2025 | 05:01 AM