Minister Tummala Nageswara Rao: మొక్కజొన్న రైతులకు రూ.588 కోట్లు!
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:52 AM
మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించిన రైతుల ఖాతాల్లో శుక్రవారం నగదు జమచేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు....
నేడు ఖాతాల్లో జమ చేస్తామన్న మంత్రి తుమ్మల
హైదరాబాద్, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించిన రైతుల ఖాతాల్లో శుక్రవారం నగదు జమచేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను రైతుల నుంచి సేకరించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 55,904 మంది రైతులకు ప్రస్తుతం చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆయిల్ ఫెడ్ కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకే ఆయన బషీర్‌బాగ్‌లోని ఆయిల్ ఫెడ్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికి అధికారులు గానీ, సిబ్బందిగానీ కార్యాలయానికి రాలేదు. కార్యాలయమంతా ఖాళీ కుర్చీలతో కనిపించటంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు రిజిస్టరును పరిశీలించారు. తుమ్మల వెనుదిరిగే సమయంలో ఒకరిద్దరు అధికారులు రావడంతో వారిని మందలించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.