Deputy CM Bhatti Vikramarka: భూ మార్పిడిపై విచారణ
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:50 AM
గత బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో జరిగిన భూ మార్పిడి వ్యవహారంపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర మంత్రులు అన్నారు. నాడు ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన వారికే భూ మార్పిడి చేశారని ఆరోపించారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో.....
గత ప్రభుత్వ నిర్ణయాలన్నీ బయటపెడతాం
మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల ప్రకటన
క్యాబినెట్ నిర్ణయాలు రహస్యంగా ఉండాలి
లీక్ చేసిన వారిపై చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు
బీఆర్‌ఎస్ హయాంలో కావాల్సిన వారికే భూ మార్పిడి
ఈ ప్రభుత్వంలో అలాంటివి జరగవు: భట్టి విక్రమార్క
భూ మార్పిడిపై కేటీఆర్, హరీశ్‌రావు దుష్ప్రచారం
ఇది ఉపసంఘం సమష్ఠి నిర్ణయం: ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో జరిగిన భూ మార్పిడి వ్యవహారంపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర మంత్రులు అన్నారు. నాడు ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన వారికే భూ మార్పిడి చేశారని ఆరోపించారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమలను రాజధాని నగరం బయటకు తరలించడం, భూ మార్పిడి వ్యవహారంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలపై వారు స్పందించా రు. భూ మార్పిడికి సంబంధించి మంత్రివర్గ నిర్ణయాలు రహస్యంగా ఉండాలని, మంత్రివర్గం ఆమోదించక ముందే వివరాలు బయటపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ప్రపంచంలోనే హైదరాబాద్ మహానగరం గా ఎదగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా పది మందికి మేలు చేసే విధంగానే ఉంటుందన్నారు. పన్నులు, రాబడుల గురించి కాకుండా.. నిర్మాణాత్మక పాలనా వ్యవస్థను తీసుకురావడంలో భాగంగానే ఔటర్ రింగు రోడ్డు బయటికి పరిశ్రమలను తరలించాలనే నిర్ణయించామని తెలిపారు. ఈ నిర్ణయం ఈ రోజు తీసుకున్నది కాద ని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగానే దీనిపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ అధికార ంలో ఉన్నప్పుడు 2022 ఆగస్టు 10న మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ‘‘మీరు మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయిస్తే పుణ్య కార్యక్రమం, రాష్ట్ర ప్రగతికి మేము పారదర్శకంగా చేస్తే తప్పుడు కార్యక్రమమా? మీరు రూ.40 వేల కోట్ల వనరులు సమీకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నది వాస్తవం కాదా?’’ అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. రెడ్, ఆరెం జ్ పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటికి తరలించాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకే తాము నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి నిధులు రావొద్దని, వస్తే అడ్డుకోవాలన్నది బీఆర్‌ఎస్ ఉద్దేశమన్నారు. నిధు లు అందుబాటులోకి వస్తే ప్ర జలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుందని, అందుకే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రివర్గ ఉపసంఘం సమష్టి నిర్ణయం..
నిధుల సమీకరణలో భాగంగా పరిశ్రమలను ఔటర్ బయటికి తరలించడానికి వీలుగా, గ్రేటర్‌లో ఉన్న పారిశ్రామిక భూముల మార్పిడి చేయాలన్నది మంత్రివ ర్గ ఉపసంఘం తీసుకున్న సమష్టి నిర్ణయమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావు పూర్తిగా అసత్యా లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోర్ హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా చేయాలని అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేశాయని, బీఆర్‌ఎస్ కూడా కొంత మేర ప్రయత్నాలు చేసిందని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో, అధికారులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భూ మార్పిడి అనంతరం పారిశ్రామిక జోన్‌లోని భూములను మల్టీ యూజ్ జోన్‌గా చేయాలని మంత్రివర్గమే నిర్ణయించిందని ఉత్తమ్ వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని పరిశ్రమలు నడుస్తుండగా, కొన్ని దివాలా తీశాయని అన్నారు. దీంతో 100 శాతం చార్జీలకు ఎవరూ ఆసక్తి చూపలేదని, పరిశ్రమలు వెళ్లిపోవాలంటే రాయితీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పాలసీ ముమ్మాటికీ హైదరాబాద్ నగరానికి పూర్తిగా న్యాయం చేయాలని తీసుకున్నదేనని చెప్పారు.
గత నిర్ణయాలన్నింటినీ బయటపెడతాం..
గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎన్ని భూ మార్పిడి ఉత్తర్వులు ఇచ్చారో త్వరలోనే లెక్కలతో సహా అన్నింటినీ బయటపెడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాచారం, మల్లాపూర్, మౌలాలి, ఉప్పల్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, రామచంద్రాపురం ప్రాంతాల్లోని పరిశ్రమలన్నీ 50 ఏళ్ల కిందట హైదరాబాద్ నగర శివారులో ఉండేవని గుర్తు చేశారు. అయితే హైదరాబాద్ పెద్దఎత్తున విస్తరించడంతో ఇవన్నీ నగరం లోపలికి వచ్చాయని, పారిశ్రామికవాడల చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పాటయ్యాయని అన్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగి, కొన్ని రోజులపాటు స్కూళ్లు, కార్యాలయాలు మూసేసే పరిస్థితి ఉందని, భవిష్యత్‌లో హైదరాబాద్‌కు ఈ పరిస్థితి రాకూడదనే పరిశ్రమలను తరలించాలనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కావాల్సిన వారి భూములను కన్వర్ట్ చేయడం, వ్యక్తిగత పరిచయాలతో సహాయం చేయడం వంటి విధానం ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. తరతమ భేదం లేకుండా నిర్ణయాలు అమల్లోకి రావాలన్నది తమ అభిమతమని చెప్పారు. బీఆర్‌ఎ్‌సలాగా తప్పుడు పనులు చేయబోమని అన్నారు. మౌలిక సదుపాయాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, పేదల సంక్షేమం కోసం ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని, ఇందుకోసం ప్రజలపై పన్నుల భారం మోపకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసం నీచానికి దిగజారుతున్నారు: జూపల్లి
బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం నీచానికి దిగజారుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని, అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.5 లక్షల కోట్ల స్కామ్ అని, ఏకపక్ష నిర్ణయమని, దక్షిణాది జిల్లాల మంత్రులకు ఈ నిర్ణయం ఇష్టం లేదని కేటీఆర్, హరీశ్ రావు రకరకాల రాతలు వండి వార్చి రాశారని విమర్శించారు. గతంలో కేటీఆర్ వ్యక్తిగతంగా 42 ఎకరాల పారిశ్రామిక భూమిని రెసిడెన్షియలల్‌గా మా రుస్తూ అనుమతులు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మాత్రమే తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. భూమార్పిడికి అనుమతినిచ్చిన భూములన్నీ ప్రభుత్వ భూములు కావని, 50-60 ఏళ్ల కిందట పారిశ్రామికవేత్తలు కొన్న భూములని పేర్కొన్నారు. ప్రజల మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గ ఉపసంఘంలో సమష్టిగా తీసుకున్న నిర్ణయంపై దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.