Telangana Government: రాష్ట్రాభివృద్ధికి 8 ప్రశ్నలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:49 AM
తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు? మూడు ట్రిలియన్ డాల ర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఎలా ముం దుకెళ్లాలి...
ప్రజల నుంచి సమాధానాలు కోరుతున్న ప్రభుత్వం.. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో ఆన్‌లైన్ సర్వే
తెలుగు, ఇంగ్లిష్‌ఉర్దూ భాషల్లో సర్వే ప్రశ్నావళి
సర్వేలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు? మూడు ట్రిలియన్ డాల ర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఎలా ముం దుకెళ్లాలి? జిల్లాల అభివృద్ధితో పాటు ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకుఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలలపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందుకోసం ఎనిమిది ప్రశ్నలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రజలు www.telangana.gov.in, వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ సర్వేలో పాల్గొని అభిప్రాయాలు తెలిపే అవకాశం కల్పించింది. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో ఈ ఆన్‌లైన్ సర్వేను శుక్రవారం సాయంత్రం ప్రారంభించింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచే మార్గాలతోపాటు పలు రంగాల్లో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ప్ర భుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా, వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకి చేర్చుతూ ఆయా రంగాల వారీగా అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకోసమే ‘తెలంగాణ రైజింగ్-2047’ పేరుతో లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి అనుసంధానంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తె లంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తోం ది. ఇందులో ప్రజలనూ భాగస్వామ్యం చేయాలన్న ఉ ద్దేశంతో ఆన్‌లైన్ సర్వేను ప్రారంభించింది. మొత్తం 8 ప్రశ్నలను రూపొందించి.. వాటికి సమాధానంగా ఎంచుకునేందుకు 3-4 ఆప్షన్లను ఇచ్చింది. సర్వేలో పాల్గొన్న వారికి ప్రభుత్వం తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ను కూడా ఆన్‌లైన్ ద్వారా జారీ చేస్తున్నారు.
డిసెంబరు 9న డాక్యుమెంట్ విడుదల..
తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్న ప్రభుత్వం ఇందులో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ)ను కూడా భాగస్వా మ్యం చేసింది. ఈ నెల 10 నుంచి 25 వరకు జరిపిన సర్వేలో వచ్చిన వివరాలన్నింటినీ ఐఎ్‌సబీ బృందం ద్వారా క్రోడీకరించనున్నారు. ఆ వివరాలను తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ కోసం పలు రంగాల్లో నిపుణులైన వారితో ఏర్పాటు చేసిన అ డ్వైజరీ కమిటీకి అందజేసా ్తరు. ఆ కమిటీ వాటన్నింటిని పరిశీలించి సమగ్ర నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందించనుంది. ఆ తరువాత డాక్యుమెంట్‌కు సంబంధించిన అంశంపై రాష్ట్ర మంత్రివర్గ స మావేశంలో చర్చించనున్నారు. క్యాబినెట్‌లో ఆమోదం పొందాక.. దానిని డిసెంబరు 9న విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్వేలోని 8 ప్రశ్నలు, వాటికి ఆప్షన్లు ఇవే..
ప్రశ్న: మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఎలా?
ఆప్షన్లు: వ్యాపార పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి విధాన సంస్కరణలు, సులభ వ్యాపార పద్ధతులు
యువత నేతృత్వంలో వ్యాపారాలకు మార్గదర్శ నం. ప్రపంచ మార్కెట్లకు వెళ్లే అవకాశం కల్పించడం
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు
పర్యాటకం, సంస్కృతి, స్థానిక ప్రోత్సాహం
చిన్న వ్యాపారాలు, స్థానిక స్టార్ట్‌పలకు మద్దతు
ఏఐ, కమ్యూనికేషన్, డిజిటల్ సేల్స్, మేనేజ్‌మెంట్ తరహా ఉద్యోగాల కల్పన తదితరాలు
ప్రతి జిల్లా అభివృద్ధి ఎలా?
సమీపంలో మంచి స్కూళ్లు, ఆస్పత్రుల ఏర్పాటు
నగరాలలో మాత్రమే కాకుండా మీ ప్రాంతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు
మహిళలకు మరింత భద్రత, అవకాశాల కల్పన
గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఆధునిక సేవలు
నిజాయితీ, పారదర్శకమైన పాలన వృద్ధి రంగాలు (ఉద్యోగ కల్పనకు ఏ రంగాలపై దృష్టి పెట్టాలి?)
ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ.
ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ టెక్నాలజీ, కోల్డ్ స్టోరేజీ
ఫార్మాస్యూటికల్, బయోటెక్, ఆరోగ్య ఆవిష్కరణలు
సెమీ కండక్టర్ల తయారీ
పర్యాటకం, సంస్కృతి, చలనచిత్రం సృజనాత్మక పరిశ్రమలు
డ్రోన్లు, స్పేస్-టెక్‌తో పాటు శిక్షణ మెరుగైన జీవన నాణ్యత?
స్వచ్ఛమైన గాలి, నీరు
మెరుగైన పారిశుధ్యం (వ్యర్థాల తొలగింపు).
అన్ని పట్టణాలు/నగరాల్లో మంచి రోడ్లు
అన్ని రోడ్లలో బస్సులు, రైళ్లు
తక్కువ ధరలకే గృహాల అందుబాటు ఆరోగ్యం, శ్రేయస్సు?
ప్రతీ మండలంలో ఆస్పత్రులు, మొబైల్ హెల్త్ వాహనాలు
తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, మందులు, టెలి మెడిసిన్
స్వచ్ఛమైన నీరు, పారిశుధ్య నియంత్రణ
ఆరోగ్య కౌన్సెలర్లు
మానసిక ఆరోగ్యం, పోషణపై అవగాహన.
ఆరోగ్య బీమా విద్య, నైపుణ్యాలు (భవిష్యత్ కోసం విద్యను ఎలా మెరుగుపరచాలి)?
ఏఐ రోబోటిక్స్, వాతావరణం
ఆధునిక బోధన, శిక్షణపొందిన ఉపాధ్యాయులు
కాలేజీలు, ఐటీఐల్లో నైపుణ్య ఆధారిత కోర్సులు
అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులుపొందే ప్రపంచస్థాయి వర్సిటీల స్థాపనను సులభతరం చేయడం.
సాఫ్ట్ స్కిల్ అభివృద్ధి, మార్కెట్ సిద్ధతపై దృష్టి.
పాలన- పౌర సేవలు
అన్ని సేవలకు వన్-స్టా్‌ప ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రోత్సహించడం
మీ ప్రాంతంలో అభివృద్ధి పనులపై సమాచారం.
తగిన బడ్జెట్లు, అధికారాలతో స్థానికతను శక్తిమంతంగా చేయడం.
మీ దృష్టి. (2047 నాటికి తెలంగాణను మీరు ఎలా చూస్తున్నారు)?
దీనికి సమాధానంగా సర్వేలో పాల్గొన్న వ్యక్తి తన అభిప్రాయాలను నమోదుచేసేలా అవకాశం కల్పించారు.
ప్రజల ఆలోచనలు తెలుసుకోవాలనే..
ఇదొక మహత్తరమైన అంశం. రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండాలి? ప్రజల అవసరాలు ఏంటి? వారికి ఏం కావాలనే వివరాలు వారి ద్వారానే తెలుసుకోవాలనే ఆన్‌లైన్ సర్వేకు శ్రీకారం చుట్టాం. సర్వే ద్వారా అన్ని జిల్లాల ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలుస్తాయి. ప్రజాభిప్రాయం మేరకే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఉంటుంది. మారుమూల ప్రజ ల అవసరాలు, సౌకర్యాలను తెలుసుకుని ఆ మేరకే డాక్యుమెంట్‌ను రూపొందిస్తాం. ప్రజలంతా ఈ సర్వేలో పాల్గొని అభిప్రాయాలు తెలపాలి.

- జయేశ్ రంజన్,
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి