Broken Rice: 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం వేలం!
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:50 AM
రాష్ట్రంలోని వివిధ చౌక డిపోలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, బఫర్ గోదాముల్లో నిల్వ ఉన్న 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని...
టెండర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ చౌక డిపోలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, బఫర్ గోదాముల్లో నిల్వ ఉన్న 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీచేశారు. కిలోకు రూ.24 (క్వింటాలుకు రూ.2,400) కనీస ధరగా నిర్ణయించారు.