Drone Show: డ్రోన్లతో గిన్నిస్ రికార్డు రైజింగ్
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:04 AM
గ్లోబల్ సదస్సు ముగింపు కార్యక్రమంలో భారీ డ్రోన్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3 వేల డ్రోన్లను ఉపయోగించి.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..
3వేల డ్రోన్లతో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. జాయిన్ ది రైజ్’ నినాదం ప్రదర్శన
ఆకట్టుకున్న వివిధ సంక్షేమ పథకాల ఆకృతులు.. ఘనంగా సదస్సు ముగింపు కార్యక్రమం
హైదరాబాద్/రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ సదస్సు ముగింపు కార్యక్రమంలో భారీ డ్రోన్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3 వేల డ్రోన్లను ఉపయోగించి.. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. జాయిన్ ది రైజ్’ నినాదం, దానిపైన పెద్దగా ఒకటి అంకె, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్‌తో చేసిన డ్రోన్ విన్యాసం.. ‘తెలంగాణ ఈజ్ రైజింగ్.. కమ్.. జాయిన్ ది రైజ్’ సుదీర్ఘ వాక్యం గిన్ని్‌సబుక్ రికార్డులు బద్దలు కొట్టాయి. గతంలో అబుధాబిలో 2,131 డ్రోన్లతో సుదీర్ఘ వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు ఉండగా.. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ షో దాన్ని బద్దలు కొట్టింది. గిన్నిస్ బుక్ ప్రతినిఽధుల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రతిబింబించేలా చేసిన డ్రోన్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ షో అనంతరం బాణసంచా ప్రదర్శన అలరించింది. బాణసంచా మెరుపులతో సదస్సు ప్రాంగణం కాంతులీనింది. సదస్సు ప్రాంగణం సమీపంలోని బేగరికంచ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల ప్రజలు కూడా అక్కడి నుంచే డ్రోన్ షో, బాణసంచా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. ఇక సదస్సు ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను బాగా ఆకట్టుకున్నాయి.గ్లోబల్ సదస్సుకు దారితీసే మార్గాల్లో, సదస్సు వద్ద భద్రత, ట్రాఫిక్ చర్యలను పకడ్బందీగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీశైలం హైవే వేలాది వాహనాలతో కిక్కిరిసింది.