Coal from SCCL: నాసి రకం బొగ్గు మాకు అంటగడతారా?
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:37 AM
మీరు సరఫరా చేసే బొగ్గును మండిస్తే బూడిద ఎక్కువ వస్తోంది. నాసిరకం బొగ్గు మాకు అంటగట్టి... మేలిమి రకం బొగ్గు ఇతర రాష్ట్రాలకు ఇస్తారా...
సింగరేణి వైఖరిని ఆక్షేపిస్తూ తెలంగాణ జెన్‌కో లేఖ
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘మీరు సరఫరా చేసే బొగ్గును మండిస్తే బూడిద ఎక్కువ వస్తోంది. నాసిరకం బొగ్గు మాకు అంటగట్టి... మేలిమి రకం బొగ్గు ఇతర రాష్ట్రాలకు ఇస్తారా? ఈ బొగ్గు వల్ల ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యం(పీఎల్‌ఎఫ్) మేరకు ఉత్పత్తి జరగడం లేదు.. ప్లాంట్లు దెబ్బతింటున్నాయి. నిర్దేశిత బొగ్గు కన్నా ఎక్కువ మండించాల్సిన పరిస్థితి నెలకొంది. తక్షణమే ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎ్‌సఏ)కు అనుగుణంగా మేలిమి రకం బొగ్గు సరఫరా చేయాలి’ అని సింగరేణి యాజమాన్యాన్ని తెలంగాణ జెన్‌కో కోరినట్లు తెలిసింది. రెండేళ్లుగా సింగరేణి సరఫరా చేస్తున్న బొగ్గుపై తీవ్ర ఆక్షేపణ తెలియజేస్తూ సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌కు జెన్‌కో సీఎండీ ఎస్.హరీశ్ లేఖ రాసినట్లు సమాచారం. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లను జీ-9, జీ-10బొగ్గును వినియోగించేలా డిజైన్ చేస్తే.. కానీ, జీ-14, 15 బొగ్గు సరఫరా చేస్తున్నారని అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది.