Share News

Deputy Chief Minister Bhatti Vikramarka: సౌరవిద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:07 AM

రాష్ట్రంలో సౌర విద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం సచివాలయంలో ఆయనను జర్మనీ ప్రతినిధులు కలుసుకున్నారు...

Deputy Chief Minister Bhatti Vikramarka: సౌరవిద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం

రాష్ట్రంలో సౌర విద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం సచివాలయంలో ఆయనను జర్మనీ ప్రతినిధులు కలుసుకున్నారు. సౌర విద్యుత్‌ వినియోగానికి తెలంగాణ ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన జర్మనీ ప్రతినిధులు.. ఆ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రతిపాదనలు అందించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ.. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, వీరిని సౌరవిద్యుత్‌ రంగంలో భాగస్వాములు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. జర్మనీ ప్రతినిధుల ప్రతిపాదనలు ఏ విధంగా తెలంగాణకు మేలు చేస్తాయో అధ్యయనం చేసి, నివేదిక అందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

Updated Date - Oct 10 , 2025 | 04:07 AM