Alcohol sales: డిసెంబరులో కిక్కే కిక్కు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:58 AM
రాష్ట్రంలో ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం, మరోవైపు చలి తీవ్రత కూడా పెరగటంతో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగాయి....
తొలి 2 వారాల్లోనే మద్యంపై ఖజానాకు రూ.2 వేల కోట్లు
పంచాయతీ ఎన్నికలు, చలి తీవ్రత పెరగటమే కారణం
ఈ నెలలో ఆదాయం 4 వేల కోట్లు దాటుతుందని అంచనా
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం, మరోవైపు చలి తీవ్రత కూడా పెరగటంతో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగాయి. ఈ నెలలో మొదటి రెండు వారాల్లోనే మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి సుమారు రూ.2,000 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో క్రిస్మస్ పండుగతోపాటు కొత్త సంవత్సరం వేడుకలు కూడా ఉండటంతో అమ్మకాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీంతో నెల మొత్తంలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికిఆదాయం రూ.4,000 కోట్లు దాటుతుందని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. 2024 డిసెంబరులో ఖజానాకు రూ.3,700 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.