ERC Allows Solar Rooftop Power: ఎక్కడైనా ఉత్పత్తి చేసుకో.. హైదరాబాద్‌లో వాడుకో
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:54 AM
అభ్యంతరాలకు సెప్టెంబరు 5 వరకు గడువు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సొంతిళ్లపై సోలార్ రూఫ్‌టాప్ పెట్టుకుని అక్కడ ఉత్పత్తయ్యే కరెంట్‌ను హైదరాబాద్‌లో వాడుకునేలా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వెసులుబాటు ఇవ్వనుంది. దీనికి సంబంధించిన నిబంధనలను ..
సోలార్ రూఫ్‌టా్‌పపై ఈఆర్‌సీ నిబంధనలు
అభ్యంతరాలకు సెప్టెంబరు 5 వరకు గడువు
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సొంతిళ్లపై సోలార్ రూఫ్‌టాప్ పెట్టుకుని అక్కడ ఉత్పత్తయ్యే కరెంట్‌ను హైదరాబాద్‌లో వాడుకునేలా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వెసులుబాటు ఇవ్వనుంది. దీనికి సంబంధించిన నిబంధనలను వెబ్‌సైట్‌లో పెట్టింది. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి వీలుగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. సెప్టెంబరు 5లోగా అభ్యంతరాలు వ్యక్తం చేయాలని గడువు విధించింది. కేంద్ర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలతో ఈఆర్‌సీ ఈ నిబంధనలు రూపొందించింది. నెట్ మీటరింగ్, గ్రూప్ నెట్ మీటరింగ్ , గ్రాస్ మీటరింగ్, వర్చువల్ నెట్ మీటరింగ్ అనే 4 విధానాలకు సంబంధించి నిబంధనలు రూపొందించింది. నెట్‌మీటరింగ్ విధానంలో 10 కిలోవాట్ల దాకా సోలార్ రూఫ్‌టా్‌పకు మీటరింగ్ పెట్టడానికి సాధ్యాసాధ్యాల నివేదిక అక్కర్లేకుండా వినియోగదారుడికి డిస్కమ్ మీటర్ బిగించాలి. గ్రూప్ మీటరింగ్‌లో ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను హైదరాబాద్‌లో ఉపయోగించుకోవచ్చు. విద్యుత్ మిగిలితే సంబంధిత డిస్కమ్‌కు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ధరలను ఈఆర్‌సీ ఖరారు చేయనుంది. వర్చువల్ మీటరింగ్‌లో గ్రామంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వినియోగదారుడితో హైదరాబాద్‌లో ఉండే వినియోగదారుడు నేరుగా ఒప్పందం చేసుకోవొచ్చు. ఈ వెసులుబాటు ప్రకారం 100 కిలోవాట్ల దాకా విద్యుత్‌ను మార్పిడి చేసుకోవచ్చు.