Share News

TGGEJAC: సద్దుల బతుకమ్మను సెలవుగా ప్రకటించాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 07:22 AM

రాష్ట్రంలో మహిళలు పవిత్రంగా జరుపుకునే సద్దుల బతుకమ్మను ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని...

TGGEJAC: సద్దుల బతుకమ్మను సెలవుగా ప్రకటించాలి

సీఎస్‌ను కోరిన టీజీఈజేఏసీ నేతలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలు పవిత్రంగా జరుపుకునే సద్దుల బతుకమ్మను ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ) నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కోరారు. ఈ నెల 30న జరుపుకునే బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వాలని కోరుతూ టీజీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, కో-చైర్మన్‌ కటకం రమేష్‌ తదితరులు సచివాలయంలో సీఎ్‌సను కలిసి వినతి పత్రం ఇచ్చారు.

Updated Date - Sep 19 , 2025 | 07:24 AM