Sridhar Babu: దేశ ఏరో స్పేస్ రాజధానిగా తెలంగాణ
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:10 AM
ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 30కి పైగా ఏరోస్పే్‌స డిఫెన్స్...
రూ.28,000కోట్లకు చేరిన ఎగుమతులు:దుద్దిళ్ల
ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 30కి పైగా ఏరోస్పే్‌స-డిఫెన్స్ ఓఈఎంఎ్‌సలు(ఒరిజినల్ ఎక్వి్‌పమెంట్ మాన్యూఫాక్చరర్లు), వెయ్యికిపైగా ఎంఎ్‌సఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఏరో స్పేస్ ఎగుమతుల విలువ రూ.28,000 కోట్లకు చేరడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ఏరోస్పేస్ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై సలహాలు, సూచనలు స్వీకరించారు.