Share News

Minister Komatireddy: సినిమాల నిర్మాణానికి అత్యుత్తమ ప్రదేశం తెలంగాణ: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:52 AM

సినిమాల నిర్మాణానికి తెలంగాణ అత్యుత్తమ ప్రదేశమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

Minister Komatireddy: సినిమాల నిర్మాణానికి అత్యుత్తమ ప్రదేశం తెలంగాణ: మంత్రి కోమటిరెడ్డి

  • సృజనాత్మకత ఎప్పుడూ మన బలం: జూపల్లి

  • హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సినిమాల నిర్మాణానికి తెలంగాణ అత్యుత్తమ ప్రదేశమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ను శుక్రవారం ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ చిత్రోత్సవం తెలంగాణకు గర్వకారణం అని పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. స్టోరీ టెల్లింగ్‌కు సంబంధించి అత్యంత శక్తివంతమైన, సంక్షిప్తమైన మార్గం లఘుచిత్రమని చెప్పారు. ఈ చిత్రోత్సవాన్ని ఈ నెల 21 వరకూ నిర్వహించనున్నట్లు సినీ దర్శకుడు, గద్దర్‌ ఫిలిం అవార్డు జ్యూరీ కమిటీ సభ్యుడు ఉమా మహేశ్వరరావు తెలిపారు. మొత్తం 704 ఎంట్రీలు వస్తే వాటిలో 60 చిత్రాలను ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 04:52 AM