Telangana Panchayat Elections 2025: ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది..
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:40 PM
స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం పంచాయితీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 31 జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్ 29వ తేదీన అనౌన్స్ చేసిన షెడ్యూల్‌ను కొన్ని కారణాల వల్ల నిలిపివేశాము. ఈ రోజు నుంచి ఎంసీసీ కోడ్ అమలులోకి వస్తుంది.
అబ్జర్వల్‌లు, ఎలక్షన్ అబ్జర్వల్‌లను నియమించాం. 31 జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11,14,17 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజే ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. నవంబర్ 27వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30వ తేదీ నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!
లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..