Share News

Vinith Kumar: ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రో డీఎం సీటు సాధించిన తెలంగాణ డాక్టర్‌

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:01 AM

డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌(డీఎం) అర్హత పరీక్షలో తెలంగాణ విద్యార్థి సత్తా చాటారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన డాక్టర్‌ చెరుపల్లి వినిత్‌ కుమార్‌ అఖిల భారత స్థాయిలో...

Vinith Kumar: ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రో డీఎం సీటు సాధించిన తెలంగాణ డాక్టర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌(డీఎం) అర్హత పరీక్షలో తెలంగాణ విద్యార్థి సత్తా చాటారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన డాక్టర్‌ చెరుపల్లి వినిత్‌ కుమార్‌ అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సీటు సంపాదించారు. మనదేశంలో డీఎం అంటే సూపర్‌ స్పెషలైజేషన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీని డీఎంగా వ్యవహరిస్తారు. డీఎం సీటు సాధించడం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. కాగా డాక్టర్‌ వినిత్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆలిండియా పీజీ మెడికల్‌ ఎంట్రెన్స్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జనరల్‌ మెడిసిన్‌ ఎండీ పూర్తి చేశారు. డాక్టర్‌ వినిత్‌ తండ్రి చెరుపల్లి నరసింహ చేనేత కార్మికుడు.

Updated Date - Dec 25 , 2025 | 05:01 AM