Share News

రాష్ట్ర ప్రజలను అవమానించిన కాంగ్రెస్‌: లక్ష్మణ్‌

ABN , Publish Date - May 28 , 2025 | 07:32 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని లక్ష్మణ్‌ విమర్శించారు. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రజలను అవమానించిన కాంగ్రెస్‌: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మూడు రోజులు ఉన్నా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఇందుకు కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనపై ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్‌ ఖండించారు. వివిధ అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత నిజాయతీపరులైతే తమ పదవులకు రాజీనామా చెయ్యాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - May 28 , 2025 | 07:32 AM