Tummidihetti Barrage: తుమ్మిడిహెట్టిపై వచ్చే నెల్లో మహారాష్ట్రకు సీఎం
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:37 AM
ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి వీలుగా సమ్మతి కోసం అక్టోబరులో ముఖ్యమంత్రి..
150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి కసరత్తు షురూ
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి వీలుగా సమ్మతి కోసం అక్టోబరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడణవీ్‌సతో భేటీ కానున్నారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం వల్ల కలిగే ముంపుపై ఇప్పటికే పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) అధ్యయనం నిర్వహించింది. 1,467 ఎకరాలు ఎకరాలు ముంపునకు గురవుతాయని లెక్కతేల్చింది. దాంతో ఆ నివేదిక ఆధారంగా మహారాష్ట్ర సీఎంను కలిసి.. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి తెలపాలని సీఎం రేవంత్ కోరే అవకాశం ఉంది. 2013 భూసేకరణ చట్టం అనుసరించి నిర్వాసితులకు గరిష్ఠ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎకరానికి రూ.25 లక్షల దాకా పరిహారానికి ప్రభుత్వం సమ్మతి తెలిపే అవకాశాలు ఉన్నాయి.