Share News

CM Revanth Reddy Visits Tirumala: తిరుమలకు సీఎం రేవంత్‌

ABN , Publish Date - Dec 30 , 2025 | 06:28 AM

శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు,

CM Revanth Reddy Visits Tirumala: తిరుమలకు సీఎం రేవంత్‌

  • తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

  • నేటి నుంచి పది రోజులు కొనసాగనున్న దర్శనాలు

తిరుమల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి):శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకోగా టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుని అనంతరం వైకుంఠ ద్వార ప్రవేశం చేయనున్నారు. అలాగే అర్ధరాత్రి పలువురు ప్రముఖులు తిరుమలకు చేరుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. కాగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామకృష్ణారెడ్డి తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటల సమయంలో తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారువాకిలి తలుపులు తెరిచారు. 1.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభించారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశి ముందు రోజు మధ్యాహ్నం నుంచే తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. అయితే ఈసారి తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఈసారి ఏకాదశి, ద్వాదశి, జనవరి 1వ తేదీకి సంబంఽధించిన టోకెన్లు ఆన్‌లైన్‌లో జారీ చేయడం, టోకెన్లు ఉన్నవారికే తొలి మూడురోజుల దర్శనం ఉంటుందని విస్తృత ప్రచారం కల్పించిన నేపథ్యంలో తిరుమల కొండ సోమవారం సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపించింది.

Updated Date - Dec 30 , 2025 | 06:28 AM