Share News

CM Revanth Reddy: బస్సు ప్రమాదంపై సీఎం దిగ్ర్బాంతి

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:04 AM

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం తనను కలచివేసిందని, అక్కడి దృశ్యాలు బాధ కలిగించాయని తెలిపారు...

CM Revanth Reddy: బస్సు ప్రమాదంపై సీఎం దిగ్ర్బాంతి

  • ఘటనపై స్వయంగా ఆరా తీసిన రేవంత్‌

  • అత్యంత దురదృష్టకరం: ప్రధాని, రాష్ట్రపతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం తనను కలచివేసిందని, అక్కడి దృశ్యాలు బాధ కలిగించాయని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున సాయం అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిని ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాద స్థలికి వెళ్లాలని అందుబాటులో ఉన్న మంత్రులను కోరారు.క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్‌, అగ్నిమాపకశాఖ డీజీ, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాదంపై స్వయంగా ఆరా తీసిన సీఎం.. అప్పటికప్పుడు సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయించారు. సహాయం కోసం 9912919545/ 9440854433 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Nov 04 , 2025 | 03:04 AM