CM Revant Reddy Declares Koti Deepotsavam: వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:27 AM
కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా, అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.....
జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తా
సతీ సమేతంగా కోటి దీపోత్సవానికి హాజరైన సీఎం
కవాడిగూడ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా, అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి సతీ సమేతంగా హాజరైన ఆయన కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే జాతీయ గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఇదే వేదికపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ శుక్రవారం చెప్పడంతో రేవంత్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తన పుట్టిన రోజును నాలుగు కోట్ల ప్రజలకు వేదికగా నిలిచే కోటి దీపోత్సవ కార్యక్రమంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను అల్దీపురం మఠం పీఠాధిపతి శ్రీవామనాశ్రమ స్వామి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి దంపతులు, స్వామీజీలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.