Chief Minister Revanth Reddy Inaugurated: స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ వెబ్‌సైట్, లోగోను ఆవిష్కరించిన సీఎం
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:39 AM
సచివాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఎస్‌పీసీఏ వెబ్‌సైట్, లోగోను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు...
హైదరాబాద్, అక్టోబర్ 16 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (ఎస్‌పీసీఏ) వెబ్‌సైట్, లోగోను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్, సీజీజీ డీజీ రవిగుప్త, ఇంటలిజెన్స్ ఎడీజీ విజయ్‌కుమార్, ఎస్‌పీసీఏ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శివశంకర్‌రావు, ఎస్‌పీసీఏ సభ్యులు పాల్గొన్నారు.