President Nitin Nabin: నితిన్ నబీన్‌తో బీజేపీ తెలంగాణ ఎంపీల భేటీ
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:20 AM
బీజేపీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్‌తో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ డీకే అరుణ నేతృత్వంలో...
న్యూఢిల్లీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్‌తో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ డీకే అరుణ నేతృత్వంలో బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో నితిన్ నబీన్‌తో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో ఎంపీలు గోడెం నగేశ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా నితిన్ నబీన్‌ను ఎంపీలు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.