Minister Tummala Nageswara Rao: మక్కల కొనుగోళ్లకు కేంద్రం సుముఖంగా లేదు!
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:10 AM
కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నల (మక్కలు) కొనుగోళ్లకు ఏమాత్రం సుముఖంగా లేదని, రాష్ట్ర ప్ర భుత్వం నుంచి ప్రతిపాదనలు పంపిస్తే ఎలాంటి స్పందన రాలేదని...
అందుకే నేటినుంచి రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: తుమ్మల
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నల (మక్కలు) కొనుగోళ్లకు ఏమాత్రం సుముఖంగా లేదని, రాష్ట్ర ప్ర భుత్వం నుంచి ప్రతిపాదనలు పంపిస్తే ఎలాంటి స్పందన రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా గురువారం నుంచి మక్కల కొనుగోళ్లు చేపడుతున్నదని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, హాకా, ఆర్‌ఐసీ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, ఇతర అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మక్కల కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, రైతులు ప్రైవేటు మార్కెట్లో కాకుండా మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయింయాలని సూచించారు. కాగా, పలు రకాల పంట ఉత్పత్తుల సేకరణ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ మంత్రి తుమ్మల ఆదేశాలు జారీచేశారు.