Share News

Telangana Bar Council elections: జనవరి 30న తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:51 AM

వచ్చే ఏడాది జనవరి 30న తెలంగాణ బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి వీ నాగలక్ష్మి షెడ్యూల్‌ విడుదల చేశారు....

Telangana Bar Council elections: జనవరి 30న తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

  • డిసెంబరు 29 నుంచి నామినేషన్ల స్వీకరణ

  • ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు.. షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా కోర్టులు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి 30న తెలంగాణ బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి వీ నాగలక్ష్మి షెడ్యూల్‌ విడుదల చేశారు. ఆయా రాష్ట్రాల్లో బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు ఆలస్యం అవుతుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మొదటి దశలో తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు జనవరి 31లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబరు 1న ప్రాథమిక ఓటర్ల జాబితా ప్రచురణతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాదనుంది. అదే నెల 10న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అదే నెల 29 నుంచి జనవరి 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న వాటి పరిశీలన చేపడతారు. 13 నుంచి 16 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. 17న తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 30న ఎన్నికలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదతలతో అభ్యర్థులు ఆయా జిల్లాల కోర్టులకు వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుత బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ సునీల్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ పొన్నం అశోక్‌ గౌడ్‌, సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌ తదితరులు పోటీ చేస్తున్న ప్రముఖుల్లో ఉన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 04:51 AM