SSC Board Exam: మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:25 AM
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి....
6 పరీక్షలు.. నెల పాటు నిర్వహణ
షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మంగళవారం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. గత పరీక్షలకన్నా భిన్నంగా ఈసారి ప్రధాన పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రథమ భాష పరీక్ష మార్చి 14న ప్రారంభం కానుండగా.. చివరి పరీక్ష సాంఘిక శాస్త్రం ఏప్రిల్ 13న నిర్వహించనున్నారు. గత ఏడాది నిర్వహించిన విధంగానే ఈసారి కూడా ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నారు. సీబీఎ్‌సఈ తరహాలో పరీక్షకు పరీక్షకు మధ్య విరామం ఇస్తూ విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేయడం ఈ నూతన విధానం లక్ష్యమని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొత్త విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నెల రోజుల పాటు పరీక్షల నిర్వహణతో విద్యార్థులపై మానసిక భారం ఎక్కు వగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.