Share News

Minister Tummala Nageswara Rao: కేంద్రం సహకరించకున్నా రూ.2400 కోట్లతో మొక్కజొన్నకు మద్దతు ధర

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:23 AM

మద్దతుధర పథకంలో చేర్చని మొక్కజొన్న పంటను కేంద్ర సర్కారు సహకారం లేకపోయినా రూ.2400 కోట్ల నిధులతో మద్దతు ధరకు సేకరిస్తామని వ్యవసాయశాఖ...

Minister Tummala Nageswara Rao: కేంద్రం సహకరించకున్నా రూ.2400 కోట్లతో మొక్కజొన్నకు మద్దతు ధర

  • పత్తిని రైతులు సీసీఐకే విక్రయించాలి

  • తేమ శాతం పరీక్షించే పరికరాలు అందుబాటులో ఉంచాలి: తుమ్మల

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యో తి): మద్దతుధర పథకంలో చేర్చని మొక్కజొన్న పంటను కేంద్ర సర్కారు సహకారం లేకపోయినా రూ.2400 కోట్ల నిధులతో మద్దతు ధరకు సేకరిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. పక్క రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర అమలు చేయకపోవడంతో సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు తమ పంటను తెలంగాణ మార్కెట్‌లో విక్రయించడం వల్ల స్థానిక కర్షకులు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా అలా మన రాష్ట్రంలో అమ్మాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో వ్యవసా యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తిని రైతులు విధిగా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కే అమ్మేలా అధికారులు చర్య లు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో పత్తి సేకరణలో సీసీఐ నిబంధనల్లో 8 నుంచి 12ువరకు తేమశాతాన్ని సడలించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరామన్నారు. ఈమేరకు తేమశాతాన్ని పరీక్షించే పరికరాలు అందుబాటులో ఉంచాల ని మార్కెటింగ్‌ అధికారులకు సూచించారు. ఈ-నామ్‌ సర్వర్‌లో సమస్య కారణంగా కొన్ని జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 04:23 AM