Share News

Minister Sridhar Babu: ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:35 AM

ఆశాజనక వృద్ధి కేంద్రాలుగా మారుతున్న ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని....

Minister Sridhar Babu: ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం

  • కీలకరంగాల్లో కలిసి పనిచేసేలా రోడ్‌మ్యాప్‌: శ్రీధర్‌బాబు

  • తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల రెండో దశ ఉత్సవం ప్రారంభం

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆశాజనక వృద్ధి కేంద్రాలుగా మారుతున్న ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. డిజిటల్‌ కనెక్టివిటీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, లైఫ్‌సైన్స్‌్‌స, బయో ఇన్నోవేషన్‌, రూరల్‌ గ్రోత్‌ తదితర రంగాల్లో వ్యూహత్మక భాగస్వామ్యానికి సమగ్ర రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తామని చెప్పారు. మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల కనెక్ట్‌(రెండో దళ) ప్రారంభోత్సవానికి శ్రీధర్‌బాబు విశిష్ట అతిథిగా హజరయ్యారు. ఈ ఉత్సవాన్ని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే గొప్ప మనస్సు తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌, ఏఐ యూనివర్సిటీ తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా మార్చుతాయన్నారు. లైఫ్‌ సైన్స్‌్‌సలో స్టార్ట్‌పలను ప్రొత్సాహించేందుకు టీహబ్‌ తరహలో వన్‌బయో పేరిట ప్రత్యేక ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో నార్త్‌ఈస్ట్‌ తెలంగాణ టెక్‌ కారిడార్‌, జాయింట్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌, బయో ఇంక్యుబరేటర్లు, క్రియేటివ్‌ టెక్‌ స్టూడియోలు, గ్రీన్‌ ఎనర్జీ కొలాబరేషన్‌లకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Nov 26 , 2025 | 04:35 AM