Share News

Mana Bathukamma: గిన్ని్‌సబుక్‌ వరల్డ్‌ రికార్డే లక్ష్యంగా..

ABN , Publish Date - Sep 29 , 2025 | 04:09 AM

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డే లక్ష్యంగా.. మన బతుకమ్మ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సరూర్‌నగర్‌ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనుంది....

Mana Bathukamma: గిన్ని్‌సబుక్‌ వరల్డ్‌  రికార్డే లక్ష్యంగా..

  • నేడు ’మన బతుకమ్మ’ వేడుకలు

  • సరూర్‌నగర్‌ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌/ఎల్‌బీనగర్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డే లక్ష్యంగా.. ‘మన బతుకమ్మ’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సరూర్‌నగర్‌ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ కీర్తిని నలుమూలలు చాటేలా పర్యాటక శాఖ, జీహెచ్‌ఎంసీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. పదివేల మంది మహిళల సమక్షంలో సోమవారం సాయంత్రం నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ కోసం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క తదితర ప్రముఖులు పాల్గొంటారని అధికారులు తెలియజేశారు.

ఎల్బీ ేస్టడియం నుంచి మహిళల సైకిల్‌ ర్యాలీ

బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఎల్‌బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన బైక్‌, సైకిల్‌ ర్యాలీని మంత్రి జూపల్లి జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా సైక్లి్‌స్టలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన విమెన్‌ బైకర్స్‌ సంప్రదాయ వస్త్రధారణతో బుల్లెట్‌ బైకులతో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated Date - Sep 29 , 2025 | 04:09 AM