Minister Jupalli: వివాహ గమ్యస్థానంగా తెలంగాణ
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:39 AM
పెళ్లి వేడుకలను జరిపించేందుకు తెలంగాణ ప్రముఖ ’వివాహ గమ్యస్థానం’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు...
హైదరాబాద్/నార్సింగ్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పెళ్లి వేడుకలను జరిపించేందుకు తెలంగాణ ప్రముఖ ’వివాహ గమ్యస్థానం’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని అక్షయ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ర్టీ(టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నాలుగో సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రె్‌స’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.దేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ వేగంగా అభివృద్థి చెందుతోందన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌ను వెడ్డింగ్ డెస్టినేషన్‌గా చూస్తోందని, అలాంటి సమయంలో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో వివాహ వేడుకల హబ్ నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.