Krishna Water Dispute: నీళ్లున్నా.. ఏపీ దురాశకు అంతులేదు
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:15 AM
కృష్ణా జలాలు శాస్త్రీయ విధానంలో పంటలకు అందిస్తే సరిపోతాయని, కానీ.. ఏపీ దురాశకు అంతులేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని తెలంగాణ తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ అభిప్రాయపడ్డారు.
కృష్ణా ట్రైబ్యునల్-2లో తెలంగాణ వాదనలు
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలు శాస్త్రీయ విధానంలో పంటలకు అందిస్తే సరిపోతాయని, కానీ.. ఏపీ దురాశకు అంతులేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని తెలంగాణ తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్(కృష్ణా-2)లో తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ విచారణ సందర్భంగా శుక్రవారం ఆయన వాదనలు వినిపించారు.
కృష్ణా బేసిన్ పరిధిలోని తెలంగాణలో కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని నివేదించారు. తెలంగాణకు నీటి కేటాయింపుల వల్ల ఏపీకి ఏ విధంగానూ నష్టం జరగదని, ఇతర బేసిన్లకే నీటిని తరలిస్తున్నందున.. ఆయా ప్రాంతాల్లో శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తే సాగు అవసరాలకు నీరు సరిపోతుందని పేర్కొన్నారు. కాగా, తదుపరి విచారణ వచ్చే నెల 28, 29వ తేదీల్లో జరగనుంది.