Share News

Minister Sridhar Babu: విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:41 AM

విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల గమ్యస్థానమని, ఐటీ, ఏరోస్పేస్‌, తయారీ, ఫార్మా రంగాలకు మంచి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో...

Minister Sridhar Babu: విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ

  • జర్మనీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌ బాబు

  • జర్మనీ-తెలంగాణ భాగస్వామ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల గమ్యస్థానమని, ఐటీ, ఏరోస్పేస్‌, తయారీ, ఫార్మా రంగాలకు మంచి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేశామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో తనను కలిసిన జర్మన్‌ ఫ్రీడరిక్‌-ఎబర్ట్‌-స్టిఫ్టంగ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు డా.సబీన్‌ ఫాండ్రిక్‌, మిర్కో గుంథర్‌, క్రిస్టోఫ్‌ మోరహ్‌ తదితరులకు రాష్ట్రంలో అమలు చేస్తున్న సులభతర పారిశ్రామిక విధానాలు, పలు సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. అత్యంత ప్రతిభావంతులైన యువత రాష్ట్రంలో ఉన్నందున నైపుణ్యాలకు కొదువలేదని తెలిపారు. జర్మనీ-తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని శ్రీధర్‌ బాబు చెప్పారు. ‘‘పరిశ్రమ భాగస్వామ్యంతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ నెలకొల్పాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పరిశోధన, వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ కేంద్రాలన్నింటినీ అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌ సెంటర్లుగా అభివృద్థి చేస్తున్నాం. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్‌ కోసం జీనోమ్‌ వ్యాలీలో ఇటీవలే ‘1 బయో’ను ఏర్పాటు చేశాం. ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా కొత్తగా ఏరో ేస్పస్‌, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు దాన్ని అధిగమించాయి. రూ.1,300 కోట్లతో ఫ్రెంచ్‌ కంపెనీ సాఫ్రాన్‌ విమాన ఇంజన్ల మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌ హాలింగ్‌ కేంద్రాన్ని నెలకొల్పింది. రఫేల్‌ యుద్థ విమానాల మరమ్మతులు, ఓవర్‌ హాలింగ్‌ ఇక్కడే జరుగుతాయి’’ అని మంత్రి వివరించారు. తమ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ సూచనమేరకు ఎంఎ్‌సఎంఇల కోసం నూతన విధానాన్ని రూపొందించామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నాలుగు లక్షల మంది గిగ్‌ వర్కర్ల భద్రత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో తాము మిగిలిన రాష్ర్టాలతో పోటీ పడటం లేదని, తమ పోటీ దేశాలతోనే అని సీఎం రేవంత్‌ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిేస్త ఇక్కడి అద్భుతమైన ఎకో సిస్టం, వాతావరణం వల్ల పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. అమెరికాలోని ప్రతి ప్రముఖ కంపెనీకి ఇక్కడ కార్యాలయాలున్నాయని జర్మన్‌ ప్రతినిధుల బృందానికి వివరించారు.

Updated Date - Nov 28 , 2025 | 04:41 AM