Share News

Crime News: స్నేహితుడి గదికి తీసుకెళ్లి రేప్‌

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:45 AM

అత్యాచార ఘటనకు సంబంధించి నల్లగొండలో ఇంటర్‌ విద్యార్థిని అప్పటికే నీరసంగా ఉండటం, ఆపై తీవ్ర రక్తస్రావం జరగడంతో ఘటనాస్థలిలోనే మృతిచెందిందని...

Crime News: స్నేహితుడి గదికి తీసుకెళ్లి రేప్‌

  • నీరసంగా ఉండటం, రక్తస్రావం జరగడంతో గదిలోనే బాలిక మృతి

  • ఇంటర్‌ విద్యార్థిని మృతి కేసులో నిందితుడు, అతడి స్నేహితుడి అరెస్టు

నల్లగొండ క్రైం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): అత్యాచార ఘటనకు సంబంధించి నల్లగొండలో ఇంటర్‌ విద్యార్థిని అప్పటికే నీరసంగా ఉండటం, ఆపై తీవ్ర రక్తస్రావం జరగడంతో ఘటనాస్థలిలోనే మృతిచెందిందని పోలీసులు వెల్లడించారు. బాలికపై అత్యాచారం, ఆమె మృతికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నల్లగొండ మండలం గుట్టకింద అన్నారం గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌ గడ్డం కృష్ణ, అతడికి సహకరించిన నల్లగొండకు చెందిన ఆటో డ్రైవర్‌ బచ్చలకూరి మధును అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను బుధవారం నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడించారు. నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని నిత్యం ఆటోలో నల్లగొండలోని కళాశాలకు వచ్చి.. సాయంత్రం అదే ఆటో తిరిగి ఇంటికి వెళ్లేది. ఆ బాలిక ఉండే గ్రామంలో మూడు నెలల క్రితం గడ్డం కృష్ణ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. బాలికను పరిచయం చేసుకున్నాడు. మూడు నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సా్‌పలో ఆమెతో చాటింగ్‌ చేస్తూ ప్రేమిస్తున్నానని చెప్పి దగ్గరయ్యాడు. రోజూ ఆమె వచ్చే ఆటోలోనే నల్లగొండకు వచ్చేవాడు. ఈ నెల 7న ఉదయం బాలిక ఆటోలో కాలేజీకి బయలుదేరింది. అయితే ఉదయం 8:30కు బాలిక ప్రయాణిస్తున్న ఆటో నల్లగొండ డీఈవో ఆఫీసు చౌరస్తాకు చేరుకుంది. అప్పటికే అక్కడికి బైక్‌పై వచ్చి వేచి ఉన్న కృష్ణ.. ఆమెను ఆ వాహనంలోంచి దింపాడు. బాలికను తన బైక్‌పై తీసుకెళితే.. ఆమె గ్రామస్థులు, ఇతరులు ఎవరైనా గుర్తుపడతారనే ఉద్దేశంతో పథకం ప్రకారం మధు అనే తన స్నేహితుడి ఆటోలో ఆమెను ఎక్కించాడు. మధు.. తన ఆటోలో ఆమెను తాను షంషూనగర్‌లో అద్దెకు ఉంటున్న గది వద్ద దిగబెట్టాడు. అనంతరం బైక్‌పై కృష్ణ ఆ గదికొచ్చాడు. గదిలోకి వెళ్లిన తర్వాత బాలికపై కృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మృతిచెందింది. అనంతరం కృష్ణ ఆ గదికి తాళం వేసి పారిపోయాడు. బాలిక మృతిచెందిన విషయాన్ని అతడు తనకు తెలిసిన వ్యక్తికి చెప్పడంతో ఘటన గురించి బాలిక తల్లిదండ్రులకు, పోలీసులకు తెలిసింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం గడ్డం కృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. అతడి స్నేహితుడు మధును పోలీసులు అరెస్టు చేశారు. మైనర్‌పై అత్యాచారం చేసినందుకు గడ్డం కృష్ణపై బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ 65(1) కింద, పోక్సో చట్టంలోని సెక్షన్లు 5, 6 కింద, అత్యాచారం కారణంగా తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతికి సంబంఽధించి బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ 105 కింద కేసు నమోదు చేశారు. కృష్ణకు సహకరించిన అతడి స్నేహితుడు, ఆటో డ్రైవర్‌ మధుపై బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ 107 కింద కేసు నమోదు చేశారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Updated Date - Oct 09 , 2025 | 04:45 AM