kumaram bheem asifabad- ఘనంగా తీజ్ ఉత్సవాలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:20 PM
రెబ్బెన కైరిగూడలో ఆదివారం తీజ్ ఉత్సవాలను బంజారా, లంబాడా మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి తీజ్ వేడుకలు చేపట్టారు. అనంతరం జిల్లా నాయకుడు అజ్మీర శ్యాం నాయక్ మాట్లాడుతూ మన పండుగలు, మన సంస్కృతిని కాపాడుకోవాలన్నారు.
రెబ్బెన, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన కైరిగూడలో ఆదివారం తీజ్ ఉత్సవాలను బంజారా, లంబాడా మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి తీజ్ వేడుకలు చేపట్టారు. అనంతరం జిల్లా నాయకుడు అజ్మీర శ్యాం నాయక్ మాట్లాడుతూ మన పండుగలు, మన సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బానోత్ సుబ్బారావు, ఇదల్, రమేష్, గణపతి, శంకర్, రవీందర్, వసంత్‌రావు, వెంకట్రావు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొని భావితరాలకు అందించాలని సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ అన్నారు. మండలంలోని కోసార భవానీనగర్‌లో ఆదివారం నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంజార జాతి సాంప్రదాయం చాలా గొప్పదని అన్నారు. బంజారా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొని భావితరాలకు అందజేయా లన్నారు. అనంతరం సంప్రదాయ రీతిలో నృత్యాలు చేపట్టారు. కార్యక్రమంలో బంజార నాయకులు ఇందులాల్, అంబారావు, రఘునాథ్, రాజ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాంనగర్‌లో ఆదివారం తీజ్ ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా భక్తిశ్రధ్ధలతో, ఆటల పాటలతో మహిళలు నృత్యాలు చేశారు. ఆదేవిధంగా బంజారాల ఆరాధ్య దైవమైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు ప్రార్థించారు. అందరిని సుఖంగా ఉంచాలని వారు అమ్మవారి కోరుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ జాదవ్ మోహన్ నాయక్, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ గణపత్ నాయక్, కాంగ్రేస్ నాయకులు విక్రం చవ్హాన్, కారోబారి హరి, రామేశ్వర్, సుభాష్, వసంత్‌రావ్, లంబాడి ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ జాదవ్, మహిళలు పాల్గొన్నారు.