Share News

Vivek Venkata Swamy: వైద్య రంగంలో సాంకేతికతే కీలకం

ABN , Publish Date - Nov 23 , 2025 | 07:33 AM

ఆధునిక యుగంలో వైద్య రంగంలో సాంకేతికత పరిజ్ఞానం కీలకంగా మారిందని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

Vivek Venkata Swamy: వైద్య రంగంలో సాంకేతికతే కీలకం

  1. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌

బంజారాహిల్స్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆధునిక యుగంలో వైద్య రంగంలో సాంకేతికత పరిజ్ఞానం కీలకంగా మారిందని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్‌లో కామన్వెల్త్‌ మెడికల్‌ ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ శనివారం ప్రారంభమైంది. వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, దాని ప్రయోజనాలు-సవాళ్లు, ఆరోగ్య ేసవల్లో ఏఐ పాత్రపై వైద్యులు, మెడికల్‌ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం, వివేక్‌ వెంకట్‌ స్వామి, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ వైద్య రంగ నిపుణులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆధునిక వైద్య సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్యసేవల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారన్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు ఏఐ సమ్మిట్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉందన్నారు. వైద్య రంగంలో ఏఐ ఆధారిత చికిత్సల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో అనేక మంది మెరుగైన వైద్యం కోసం నగరానికి వస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 07:34 AM