విద్యార్థుల్లో బోధనా సామర్థ్యాలు పెంచాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:25 PM
విద్యార్థుల్లో బోధనా సామర్థ్యాలను మరింతగా పెంచేం దుకు ఉపాధ్యాయులు కృషి చేయా లని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్ అన్నారు.
- కొండారెడ్డిపల్లిలో పాఠశాలను పరిశీలించినడీఈవో
వంగూరు, నవంబరు 6 : (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల్లో బోధనా సామర్థ్యాలను మరింతగా పెంచేం దుకు ఉపాధ్యాయులు కృషి చేయా లని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్ అన్నారు. మండలం లోని కొండారెడ్డిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను గురువారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యా యుల హాజరు రిజిస్టర్‌ను ఆయన పరి శీలించా రు. అనంతరం డీఈవో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపా ధ్యాయులు విధిగా సమయపాలన పాటిం చాలని, విద్యార్థుల బోధన సామర్థ్యాలను మరిం తగా మెరుగు పర్చాలని సూచించారు. పాఠశా లలో మధ్యాహ్న భోజనం అమలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.