Share News

విద్యార్థుల ఉన్నతికి బోధన కొనసాగాలి

ABN , Publish Date - May 17 , 2025 | 11:15 PM

విద్యార్థుల ఉన్నతికి బోధన కొనసాగాలిTeaching should continue for the betterment of students.

విద్యార్థుల ఉన్నతికి బోధన కొనసాగాలి
తాడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- తాడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ

తాడూరు, మే 17 ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత స మాజాన్ని దృష్టిలో ఉంచుకుని అందుకనుగు ణంగా విద్యార్థుల భవిష్యత్‌ తరాలకు రథసార థులుగా తీర్చిదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యా యులకు మాత్రమే ఉంటుందని కలెక్టర్‌ బదావ త్‌ సంతోష్‌ అన్నారు. శనివారం మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు శిక్ష ణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్ర మాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి అనం తరం ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ ఉన్నత పాఠ్యాంశ శిక్షణ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రాథమిక స్థాయి నుంచే అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడే విధంగా ఉపాధ్యా యులకు శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదప డుతున్నాయ ని, అనుభవజ్ఞులైన జిల్లా రి సోర్స్‌ పర్సన్స్‌తో పాటు ఉపా ధ్యాయులకు నిరంతర వృత్తిప రమైన బోధన అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామ న్నారు. పిల్లలు ఎలా నేర్చుకుం టారో ఉపాధ్యాయులు తెలుసు కోవడం చాలా ముఖ్యమని అ న్నారు. సబ్జెక్టుల వారీగా సాం ఘిక శాస్త్రం, ఇంగ్లిష్‌, గణితం విషయాల్లో గుణాత్మక శిక్షణ మూడు విడతల్లో ఉంటుందని కలెక్టర్‌ తెలి పారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్య ను అభ్యసించి పదవ తరగతి 530 మార్కులు సాధించిన పుష్ప, సునీతల అనే విద్యార్థులను శాలువాతో సన్మానించారు. అనంతరం తాడూరు గ్రామంలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న గడ్డం రాము ఇంటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీని వాస్‌రెడ్డి, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌చార్జి బరపటి వెంకటయ్య, ఎంపీడీవో ఆంజనేయులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:15 PM